కరీంనగర్ (విజయక్రాంతి): కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మానవాత్వం చాటుకున్నారు. మానకొండూరు మండలం ఖెల్లడ గ్రామానికి చెందిన దివ్యశ్రీ అనే మహిళ లారీ కింద ఇరుక్కుని కేకలు వేయడంతో హుజూరాబాద్ సమీపంలోని సింగాపూర్ శివారులో కొద్దిదూరం వెళ్లాక డ్రైవర్ లారీని ఆపాడు. ములుగు వెళుతూ ఘటనా స్థలం వద్ద ఆగిన కేంద్ర మంత్రి బండి సంజయ్ హుటాహుటిన లారీ వద్దకు వెళ్లి లారీ కింద టైర్ పక్కన రాడులో జుట్టు చిక్కుకుని రక్తమోడుతూ వెళాడుతున్న దివ్యశ్రీని చూసిన సంజయ్ భయపడొద్దు ధైర్యంగా ఉండాలని సూచించాడు. అటువైపు వెళుతున్న లారీలను ఆపి జాకీలు, కత్తెర తెప్పించిన బండి సంజయ్ ప్రాణాలతో విలవిల్లాడుతున్న మహిళను కాపాడేందుకు ప్రయత్నం చేశాడు. కేంద్ర మంత్రి సూచనతో జుట్టు కత్తిరించి ప్రాణాలను కాపాడిన స్థానికులు తల్లిని చూసి భోరున విలపించిన పిల్లలు గాయాలపాలైన మహిళను కరీంనగర్ లోని లైఫ్ లైన్ ప్రైవేట్ ఆసుపత్రికి పంపిన సంజయ్ దివ్యశ్రీ చికిత్సకు అయ్యే ఖర్చును తానే చెల్లిస్తానని ఆసుపత్రి వైద్యులకు సంజయ్ చెప్పాడు.