calender_icon.png 1 February, 2025 | 7:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ గతినే మార్చే అద్బుతమైన బడ్జెట్

01-02-2025 04:13:41 PM

హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ 2025-26 కేవలం లెక్కల పద్దు మాత్రమే కాదు, ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) దార్శనికత, స్వావలంబన, వృద్ధి, శ్రేయస్సుతో కూడిన వికసిత్ భారత్ కు ఒక రోడ్ మ్యాప్ అని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) అన్నారు. రైతు సంక్షేమం నుంచి మధ్యతరగతికి ఉపశమనం వరకు, మహిళలు, యువతకు సాధికారత కల్పించడం నుంచి స్టార్టప్ లకు ప్రోత్సాహం వరకు, మౌలిక సదుపాయాలు కల్పన నుండి పెట్టుబడులను ప్రోత్సహించడం వరకు, ఈ బడ్జెట్(Union Budget 2025-26) దేశంలోని ప్రతి ఒక్కరిని, వారి కలను సాకారం చేసే దిశగా సాగిందని ఆయన కొనియాడారు. సాహసోపేతమైన, సమ్మిళిత, భవిష్యత్తుకు బంగారు బాట పరిచేలా ఉన్న బడ్జెట్ ను రూపొందించినందుకు ప్రధానమంత్రి మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్(Finance Minister Nirmala Sitharaman) కు బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు.

నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్-2025 దేశ గతినే మార్చే అద్బుతమైన బడ్జెట్ అని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఇది పేద, మధ్య తరగతి, యువత, రైతు సంక్షేమ బడ్జెట్ అన్నారు. రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు విప్లవాత్మకమైన నిర్ణయమన్నారు. తెలంగాణ సహా దేశంలోని ఒక్కో ఉద్యోగికి రూ.80 వేల వరకు ఆదా.. గత 75 ఏళ్లలో మునుపెన్నడూ లేనివిధంగా మధ్యతరగతికి అనుకూలమైన బడ్జెట్ ఇదన్నారు. తెలంగాణలో 50 లక్షల మందికిపైగా రైతులకు రూ.5 లక్షదాకా రుణం పొందే అవకాశం, కిసాన్ క్రెడిట్ కార్డుల కోసం రైతులంతా దరఖాస్తు చేసుకోవాలని కేంద్రమంత్రి పిలుపునిచ్చారు.ఇది సంక్షేమ బడ్జెట్-ప్రజల పెన్నిధి నరేంద్ర మోడీ అని కేంద్రమంత్రి బండి సంజయ్‌ పేర్కొన్నారు.