calender_icon.png 28 January, 2025 | 8:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గద్దర్‌కు అవార్డు ఎలా ఇస్తాం?: కేంద్రమంత్రి బండి సంజయ్

27-01-2025 01:38:42 PM

కేంద్ర సంక్షేమ పథకాలకు కేంద్రం పేర్లు పెట్టాలి

హైదరాబాద్: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) మరోసారి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేశారు. నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇందిరమ్మ పేరు ఎలా పెడతారు?, రేషన్ ఇచ్చేది కేంద్రం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఫోటో ఎందుకు పెడుతున్నారు? అని హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రశ్నించారు. రైతు వేదిక డబ్బులు కేంద్రప్రభుత్వానివే అన్నారు. కేంద్ర సంక్షేమ పథకాలకు కేంద్రం పేర్లు పెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇస్తా అన్న ఆరు గ్యారెంటీలు(Congress six guarantees) ఇంకా ఎందుకు అమలు చేయట్లేదని బండి సంజయ్ ద్వజమెత్తారు.

కేంద్రం, రాష్ట్రం కలిస్తేనే అభివృద్ధి

రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని బండి సంజయ్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ(Telangana Development) అభివృద్ధికి సహకరిస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం పథకాల పేర్లను మార్చేస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం పేరు కోసమే పాకులాడుతోంది? మాకు ఎలాంటి బేషజాలు లేవు.. కేంద్రం, రాష్ట్రం కలిస్తేనే అభివృద్ధి సాధ్యమని బండి సంజయ్(Bandi Sanjay ) సూచించారు. 

గద్దర్‌కు అవార్డు ఎలా ఇస్తాం?

పద్మ అవార్డులు(Padma Awards 2025) స్థాయి ఉన్న వారికి ఇస్తామని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. గద్దర్(Gaddar)కు అవార్డు ఎలా ఇస్తాం?, బీజేపీ కార్యకర్తలను, పోలీసులను చంపిన వారికి అవార్డులు ఎలా ఇస్తాం? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ సెంటిమెంట్ తో లాభపడింది ఎవరనేది ప్రజలకు తెలుసు? అని బండి సంజయ్ కుమార్ వివరించారు.

తెలంగాణ రాష్ట్రానికి ప్రతిపాదించిన ప్రముఖుల పేర్లను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలను అవమానించిందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి 2025 పద్మ అవార్డులపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. తెలంగాణకు చెందిన ఇద్దరు వ్యక్తులు డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి, మంద కృష్ణ మాదిగ అవార్డులు పద్మ అవార్డులు అందుకున్న విషయం తెలిసిందే.