‘రజాకార్’ సినిమాపై కేంద్ర మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay ) ప్రశంసలు కురిపించారు. ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమని పేర్కొన్నారు. కాలం దాచిన తెలంగాణ విముక్తి(Liberation of Telangana) పోరాటాన్ని, మన తెలంగాణ పోరాట యోధుల చరిత్రను అత్యద్భుతంగా తెరకెక్కించిన సినిమా ‘రజాకార్’ అని బండి సంజయ్ పేర్కొన్నారు. రజాకార్ల దురాగతాలను ఎదురించడానికి ప్రజలే సాయుధులై కదన రంగంలో దిగిన యదార్థ కథ ఇది. చరిత్ర పుటల్లో దాగిన ఈ నెత్తురు జీవితాలను కళ్ళకు కట్టినట్లు చూపిన సినిమా(Razakar movie) ‘రజాకార్’.
నిజాం హయాంలో జరిగిన మారణహోమాన్ని, హిందువులపై జరిగిన దౌర్జన్యాలను, బలవంతపు మత మార్పిడులను అడ్డుకునేందుకు ప్రజలే సాయుధులై ఎలా పోరాటం చేశారో ఈ ‘రజాకార్’(Razakar) సినిమాలో చూపించారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను నేటి తరానికి అందించాలనే ఉద్దేశంతో అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి, ఆర్థిక నష్టాలు ఎదురైనా భయపడకుండా గూడూరు నారాయణ రెడ్డి(Guduru Narayana Reddy) నిర్మించిన గొప్ప సినిమా ‘రజాకార్’ సినిమా ఈనెల 24 నుంచి ఓటీటీ వేదికగా ఆహాలో ప్రసారం కాబోతుంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని బండి సంజయ్ కోరారు. ముఖ్యంగా ప్రతీ హిందువు తప్పకుండా ఈ మూవీ చూడాలని కోరుతున్నానని ఆయన తెలిపారు.