calender_icon.png 23 December, 2024 | 10:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూపా దేవికి నివాళులర్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

03-08-2024 05:26:46 PM

కరీంనగర్: చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం సతీమణి మేడిపల్లి రూపా దేవి సంస్మరణ సభ శనివారం చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలోని జి ఆర్ ఆర్ గార్డెన్స్ లో జరిగింది. ఈ మేరకు సంస్కరణ సభకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరై రూపా దేవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అలాగే వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ నివాళులు అర్పించారు. సంస్మరణ సభకు చొప్పదండి నియోజకవర్గం లో ని ఆరు మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని రూపా దేవికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.