calender_icon.png 26 January, 2025 | 10:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

25-01-2025 03:36:21 PM

బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు దొందూ దొందే.. 

ఇందిరమ్మ ఇల్లు పేరు పెడితే కేంద్రం నుంచి ఒక్క ఇల్లు రాదు

రేషన్ బియ్యం, ఇళ్లు ఇచ్చేంది కేంద్ర ప్రభుత్వం

కరీంనగర్ డంప్ యార్డ్ సమస్య పరిష్కరించింది మేమే

కరీంనగర్ కార్పొరేషన్ ను మాకు అప్పగించండి: బండి సంజయ్

హైదరాబాద్: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) సమక్షంలో కరీంనగర్ మేయర్ సునీల్ రావు(Mayor Sunil Rao) బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ... బీఆర్ఎస్ నేతలపై పెట్టిన కేసులన్నీ ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. కేసీఆర్ చేసిన పనులనే రేవంత్ రెడ్డి చేస్తున్నారని బండి సంజయ్(Bandi Sanjay Kumar) ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ పై ఆధారాలు ఉన్నాయన్నారు.. దాని ఊసే లేదని విమర్శించారు. ఈ ఫార్ములా కారు రేసు గురించి ఏమైంది?, ఫామ్ హౌస్ కేసు విచారణ ఏమైంది? అని ప్రశ్నించారు. గ్రీన్ కో(Greenko) సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీకి చందాలు వచ్చాయా.. లేదా.. చందాలు ఇచ్చిన సంస్థనే మళ్లీ ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.

2024 నుంచి ఇప్పటి వరకు రూ 5 లక్షల కోట్లు పెట్టుబడులు అన్నారు. ఎన్ని పెట్టుబడులు వచ్చాయి.. ఎందరికీ ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం ఇవ్వాడని బండి సంజయ్ డిమాండ్ చేశారు. పెట్టుబడులు, ఉద్యోగాలపై శ్వేతపత్రం ఇచ్చే ధైర్యం ఉందా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు దొందూ దొందే అన్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్ ఇవ్వడం లేదు, ఆస్పత్రులకు ఆరోగ్య శ్రీ బిల్లులు(Aarogyasri Bills) చెల్లించడం లేదు, ఇందిరమ్మ ఇల్లు పేరు పెడితే కేంద్రం నుంచి ఒక్క ఇల్లు రాదని స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చే ఇళ్లకు పీఎం ఆవాస్ యోజన పేరు ఉండాలన్నారు. రేషన్ బియ్యం, ఇళ్లు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం అన్నారు. పేర్లు, ఫొటోలు మార్చి ప్రచారం చేసుకుంటున్నారు. మండలి, స్థానిక ఎన్నికల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రశ్నించే వ్యక్తులను గెలిపిస్తేనే సుపరిపాలన సాధ్యమని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. కరీంనగర్ లోని డంప్ యార్డ్ గురించి బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) పదేళ్లు పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. కరీంనగర్ లో ని డంప్ యార్డ్ సమస్య పరిష్కరించింది తామేనని బండి సంజయ్ పేర్కొన్నారు. కరీంనగర్ కార్పొరేషన్(Karimnagar Municipal Corporation)ను మాకు అప్పగించండి.. సమూల మార్పులు తెస్తామని బండి సంజయ్ కుమార్ సూచించారు.