10-04-2025 12:33:47 AM
నివాళులర్పించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్
ముషీరాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ క్రియాశీలక కార్యకర్త, మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ టైగర్ అలె నరేంద్ర వర్ధంతిని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నరేంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం కార్పొరేటర్ ఎ. పావని, బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ సాధన పోరాటంలో కీలక పాత్ర పోషించిన స్వర్గీయ నరేంద్ర, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ క్రియాశీలక కార్యకర్తగా, మాజీ కేంద్ర మంత్రి గా ప్రజలకు విశిష్ట సేవలను అందించారని అన్నారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా నరేంద్ర కలలను సాకారం చేసేందుకు తాము ముందుకు సాగుతున్నమన్నారు.
నరేంద్ర స్ఫూర్తితో నాయకులు, కార్యకర్తలు ప్రజాభ్యున్నతికి కృషి చేయాలని వారు పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అద్యక్షులు వీ.నవీన్ కుమార్, సీనియర్ నాయకులు శ్రీకాంత్, దామోదర్, ఎం. ఉమేష్,సత్తి రెడ్డి, ప్రకాష్ యాదవ్, అశోక్ యాదవ్, శ్రీనివాస్ యాద వ్, సురేష్, లక్ష్మణ్ యాదవ్, దోనేటి సత్యం, డి. కుమార్ తదితరులు పాల్గొన్నారు.