calender_icon.png 1 January, 2025 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్రీయ గృహమంత్రి దక్షతా పదక్ అవార్డులు

02-11-2024 01:00:38 AM

రాష్ట్రం నుంచి 22 మంది పోలీసుల ఎంపిక

హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఈ ఏడాదికి గానూ కేంద్రీయ గృహమంత్రి దక్షతా పదక్ అవార్డులను కేంద్ర హోంశాఖ గురువారం ప్రకటించింది.

వివిధ ప్రత్యేక ఆపరేషన్లు, కేసుల దర్యాప్తు, సాహోసోపేతమైన సేవలు అందించిన వారికి, నేరాలను అరికట్టడంలో సమర్థంగా పనిచేసిన వారికి, తీవ్రవాదం, ఉగ్రవాదం అరికట్టడంలో కీలకంగా వ్యవహరించిన వారికి ఈ అవార్డులు అందిస్తారు. దేశవ్యాప్తంగా 463 మంది పోలీసు సిబ్బందికి ఈ అవార్డులను ప్రకటించారు.

తెలంగాణ నుంచి ఓ ఎస్పీ సహా 22 మందికి ఈ అవార్డులు దక్కాయి. ఎస్పీ భాస్కరన్, గ్రూప్ కమాండర్ జే రాఘవేందర్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు బీసం హరిప్రసాద్, కొంపల్లి శ్రీనివాస్, చేగూరి సుదర్శన్‌రెడ్డి, ఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబు ళ్లకు అవార్డులు దక్కాయి.