మునుగోడు (విజయక్రాంతి): డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురించి, భారత రాజ్యాంగం మీద పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను తక్షణమే మంత్రి పదవి నుంచి బర్తరపు చేయాలని, బేషరతుగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సిఐటియు మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు డిమాండ్ చేశారు. శనివారం మునుగోడు మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద సిఐటియు, రైతు, డివైఎఫ్ఐ, కెవిపిఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నల్ల గుడ్డుతో నిరసన తెలిపి మాట్లాడారు. పార్లమెంటులో అంబేద్కర్ పేరు పెట్టుకోవడం ఒక ప్యాషన్ గా మారిందని వ్యాఖ్యానించిన అమిత్ షా, దేవుడు పేరును తరచూ పెడితే స్వర్గం ఏడు రేట్లు గ్యారెంటీ అని అన్నారు. అంబేద్కర్ను అవకాశవాదంగా ఆక్రమించుకుంటూ ఆయనను కించపరిచే ఆర్ఎస్ఎస్-బిజెపి కులతత్వాన్ని, మతతత్వాన్ని అమిత్ షా పార్లమెంటులో వెల్లడించారు.
దేశంలో బిజెపి ప్రభుత్వ హయాంలో అణగారణ వర్గాల హక్కులకై దాడులు నిరంతరం జరుగుతూనే ఉన్నాయని విద్యా రంగంలో కూడా మోడీ ప్రభుత్వం బహిరంగంగా దళిత వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తుందని అన్నారు. అట్టడుగు వర్గాల పట్ల వారు వైగారిని చెప్పకనే చెప్పారని ఈ దుర్మార్గమైన, దారుణమైన అహంకార చర్యలను దేశ ప్రజలు సమీకరణవాదులు ఖండించాలని కోరారు. అంబేద్కర్ వారసత్వాన్ని తుంగలో తొక్కి కఠోరమైన మనవాదాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు బిజెపి విశ్వప్రయత్నం చేస్తుందని దీనిని దేశ ప్రజలు గమనించి బిజెపికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం కోసం ప్రజాస్వామ్యం కోసం అంబేద్కర్ వారసులంగా అంబేద్కర్ వారసత్వాన్ని కాపాడుకోవడానికి ప్రజా సంఘాలుగా ముందుంటామని తెలిపారు.
భావితరాలకు భవిష్యత్తుకు రాజ్యాంగం ఒక దిక్సూచి అని కొనియాడారు, బిజెపి నాయకులు ఎక్కడ పడితే అక్కడ రాజ్యాంగం గురించి, అంబేద్కర్ గురించి మాట్లాడడం ఒక ప్యాషన్ గా అయిందని ఇలాంటి చర్యలు పునరావృతం అయితే బిజెపి బలమైన పోరాటాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బిజెపి హయాంలో విశ్వవిద్యాలయాలు ఆత్మహత్య క్షేత్రాలుగా దిగజారాయని, ఐఐటీలో వంటి కేంద్ర విశ్వవిద్యాలయాలలో 56% ఆత్మహత్యలు అనగారిన కులాలు, తరగతులు, గిరిజన వర్గాలకు చెందిన విద్యార్థులేనని గుర్తు చేశారు.
ఇప్పటికైనా బిజెపి అహంకారపూరితమైన మాటలను పునరావృతం చేయకుండా సరి చేసుకోవాలని, ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు యాసరని శ్రీను, చిక్కుల నరసింహ, వేముల లింగస్వామి, కెవిపిఎస్ వంటపాక అయోధ్య, భావన నిర్మాణ కార్మిక వెంకట్రావు, ఎర్ర మహేందర్, జిపి వర్కర్స్పెద్దమ్మ, అందాలు, ఇందిరమ్మ మిడ్డే మిల్ గంగుల దమయంతి, అలివేలు, మల్లమ్మ ఉన్నారు.