calender_icon.png 1 February, 2025 | 1:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రపతితో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ భేటీ

01-02-2025 10:21:37 AM

బడ్జెట్ ట్యాబ్‌తో రాష్ట్రపతి భవన్ కు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 

బడ్జెట్‌ కాపీని రాష్ట్రపతికి అందించిన ఆర్థిక మంత్రి

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం నాడు లోక్ సభలో బడ్జెట్-2025(budget 2025) ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే బడ్జెట్ ట్యాబ్ తో రాష్ట్రపతి భవన్ కు చేరుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu)తో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Finance Minister Nirmala Sitharaman), ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమావేశమై బడ్జెట్‌ కాపీని అందజేశారు. నేడు ఉదయం 11 గంటలకు పార్లమెట్ ముందుకు 2025-26 ఏడాది వార్షిక బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. వరుసగా ఎనిమిదోసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు.

ఎన్డీఏ ప్రభుత్వం(National Democratic Alliance ) మూడో దఫా అధికారంలోకి వచ్చాక తొలి పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. మధ్యతరగతి, వేతన జీవులు బడ్జెట్ పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆదాయ పన్ను శ్లాబులను ఆరు నుంచి మూడుకు కుదించే అవకాశముంది. మందగించిన వృద్ధిరేటు మెరుగుకు మరిన్ని చర్యలుంటాయని అంచనా వేస్తున్నారు. జన్ ధన్, ముద్ర యోజన(Mudra Yojana scheme) పథకాలకు కేటాయింపులు పెంపు, పట్టణాల్లో కోటి మందికి ఇళ్లు నిర్మాణానికి సాయం అందించే సూచన కనిపిస్తోంది. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ పథకానికి కేటాయింపులు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఆర్థిక సాయం పెంచే అవకాశముంది. స్థానిక తయారీ రంగం ప్రోత్సాహానికి రాయితీలు, ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధికి బడ్జెట్ లో పెద్దపీట, పేదలు, మధ్యతరగతి, మహిళల కోసం కొత్త పథకాలు ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు(Financial experts) అంచనా వేస్తున్నారు.