న్యూఢిల్లీ: మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం సంతాపం తెలిపింది. డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించినట్లు మంత్రిమండలి ఒక ప్రకటనలో తెలిపింది. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్(Manmohan Singh) విచారకరమైన మరణం పట్ల కేబినెట్ ప్రగాఢ విచారం వ్యక్తం చేస్తూ ఏడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది.