28-02-2025 12:00:00 AM
23 సవరణలకుగాను పద్నాలుగింటికి అంగీకారం
మలి విడుత బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంటు ముందుకు బిల్లు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) నివేదిక ఆధారంగా వక్ఫ్ సవరణ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టు సమాచారం. ఫిబ్రవరి 19న జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో జేపీసీ రిపోర్టు ఆధారంగా వక్ఫ్ సవరణ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. బిల్లులో జేపీసీ 23 మార్పులు సూచించగా అం దులో 14 మార్పులకు క్యాబినెట్ ఆమో దం తెలిపినట్టు తెలుస్తుంది.
దీంతో మర్చి 10 నుం చి ప్రారంభమయ్యే పార్లమెంట్ మలి విడత బడ్జెట్ సమావేశాల్లో వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టడానికి ప్రభుత్వానికి మార్గం సుగమం అయింది. కాగా బీజేపీ ఎంపీ జగదాంబికాపాల్ నేతృత్వంలోని జేపీసీ రిపోర్టును కేంద్ర ప్రభుత్వం 2025 బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఫిబ్రవరి 13న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది.
జేసీపీ సమర్పించిన నివేదికపై ప్రతిపక్షాలు తీవ్రంగా ఆందోళనలు చేయడంతో అప్పుడు సభల్లో గందరగోళం ఏర్పడింది. తమ అభ్యంతరాను ప్రభు త్వం రిపోర్టు నుంచి తొలగించిందని ప్రతిపక్షాలు ఆరోపించగా.. ప్రభుత్వం మాత్రం వాటిని ఖం డించిన విషయం తెలిసిందే. జేపీసీ ముందుకు బిల్లుకు సంబంధించి 60కిపైగా సవరణలు రాగా అందులో ప్రతిపక్షాలు సూచించిన 44 సవరణలను కమిటీ తిరస్కరించింది. ఈ క్రమం లోనే బిల్లుపై బీజేపీ దాని మిత్రపక్ష సభ్యు లు 23 సవరణలు సూచించగా అందు లో 14 సవరణలను ఓటింగ్ ద్వారా ప్యానెల్ ఆమోదించింది.