ఉదయం 11 గంటలకు లోక్‌సభలో..
వరసగా ఎనిమిదో బడ్జెట్ సమర్పించనున్న నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల తర్వాత గత ఏడాది జులైలో 2024- -25 ఆర్థిక సంవత్స రానికి మధ్యంతర బడ్జెట్‌ను మాత్రమే సమర్పించిన ఆర్థికమంత్రి ఈ సారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను సమర్పించనున్నారు.
లోక్‌సభలో ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను సమర్పిస్తారు. 2019లో ఆమె ఆర్థిక మంత్రిగా బాధ్యత లు స్వీకరించిన నాటినుంచి తాత్కాలిక బడ్జెట్లతో కలిపి మొత్తం ఏడు బడ్జెట్లు సమర్పించారు. ఫిబ్రవరి 1న ఎనిమిదో దానికి సిద్ధమవుతున్నారు. అంతకుముందు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ అత్యధికంగా 10 బడ్జెట్లు ప్రవేశపెట్టిన రికార్డును సొంతం చేసుకొన్నారు.
ఇక 9 బడ్జెట్లతో మాజీ మంత్రి చిదంబరం రెండో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత నిర్మలమ్మ మూడో స్థానంలోకి చేరి,పణబ్ ముఖర్జీ రికార్డును సమానం చేయనున్నారు. కాగా నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పై పారిశ్రామికవర్గాలతో పాటుగా మధ్యతరగతి వర్గం కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తోం ది. బడ్జెట్లో పన్ను చెల్లింపుల విధానంలో భారీ మార్పులు ప్రకటిస్తారని, పన్నుశ్లాబుల్లో మార్పులు చేయడం ద్వారా ఊరట కల్పి స్తారని ఆ వర్గం ఆశగా ఎదురు చూస్తోంది.
శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటునుద్దేశించి చేసిన ప్రసంగంలో సైతం రాబోయే బడ్జెట్లో మధ్యతరగతి వర్గాల అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని ప్రకటించడంతో ఈ ఆశలు మరింత ఎక్కువయ్యాయి.
పార్ల మెంటు సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజలు బాగుండాలని తాను మహాలని ప్రార్థిస్తానంటూ చేసిన వ్యాఖ్యలతో రాబోయే బడ్జెట్ ఈ వర్గాల సంక్షేమానికి పెద్ద పీట వేయవచ్చని ఆయా వర్గాలు భావిస్తున్నారు.
ఇప్పటికే ఈ వర్గాల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు తోడుగా మరిన్ని పథకాలను ప్రకటిం చడమో, ఉన్న వాటిని మరింత విస్తృతం చేయడమో జరుగుతుందని వారంతా ఎదురు చూస్తున్నారు.అన్నిటికన్నా ముఖ్యం గా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసే చర్యలు తప్పక ఉంటాయని అన్ని వర్గాలు భావిస్తున్నాయి. అలా కాని పక్షంలో ఇప్పటికే ధరల భారంతో కుంగిపోతున్న సామాన్యుడి బతుకు మరింత భారమవుతుంది. నిర్మలమ్మ ఏం చేస్తారో చూడాలి.
బడ్జెట్‌పై నిర్మలమ్మ ముద్ర
కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ 2019లో బాధ్యతలు స్వీకరించగానే ప్రవేశపెట్టిన తొలిపద్దులో పారిశ్రామిక రంగానికి సంబంధించి పన్నుల్లో కీలక సంస్కరణలను తీసుకొచ్చారు. వ్యాపారాల మధ్య పోటీతత్వం పెంచడంతోపాటు భారీ పెట్టుబడులను ప్రోత్సహించే దిశగా కార్పొరేట్ పన్నును తగ్గించారు.
అప్పట్లో ఈ నిర్ణయాన్ని చాలామంది స్వాగతించారు. కానీ, కాలం గడిచేకొద్దీ ఆ మేరకు కొత్త ఉద్యోగాలు రాకపోవడం చర్చనీయాంశమైంది. పాత ఆదాయపు పన్ను విధానంలోని సంక్లిష్టతలను తొలగిస్తూ.. కొత్త విధానాన్ని 2020లో ప్రతిపాదించారు. దీనిలో తక్కువ పన్ను రేట్లను ఇచ్చారు.
పాత, కొత్త విధానాల్లో ఒక దానిని ఎంపిక చేసుకొనే అవకాశం పన్ను చెల్లింపుదారులకు ఇచ్చారు.నిర్మలా సీతారామన్ అత్యధికంగా స్టార్టప్‌లు, సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి పైనే అధికంగా దృష్టి సారించారు. ఆమె గత బడ్జెట్ ప్రసంగాలు వింటే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది.
కంపెనీ చట్టంలో కీలక సంస్కరణలు
గతంలో కంపెనీ చట్టంలో కొన్ని ప్రొవిజన్లు అత్యంత కఠినంగా ఉండేవి. వీటిని 2021- -22 బడ్జెట్లో సీతారామన్ డీక్రిమినలైజ్ (నేర రహితంగా) చేశారు. ఇది దేశంలో వ్యాపారానుకూల వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు ఉపయోగపడింది. చిన్న ఉల్లం ఘనలను నేరాల నుంచి తొలగించారు.
ప్రొసీజర్‌లో లోపాలు, టెక్నికల్ డీఫాల్టులు వంటివి వీటిల్లో ఉన్నాయి. అనుకోకుండా జరిగే లోపాల విషయంలో వ్యాపారులకు ఊరటనిచ్చారు. కొన్ని రకాల వాటిని సివిల్ పెనాల్టీలతో సరిపెట్టారు. కంపెనీలు, సంస్థ లు న్యాయసంబంధ ఇబ్బందులపై కాకుండా.. వృద్ధి పైనే దృష్టిని కేంద్రీకరించేలా చేసేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడింది.