07-07-2024 12:50:47 AM
22 నుంచి పార్లమెంటు సమావేశాలు
న్యూఢిల్లీ, జూలై 6: మోదీ 3.0 ప్రభుత్వం ఎజెండాను వెల్లడించే కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న లోక్‌సభలో ప్రవేశపెడతారు. బడ్జెట్ కోసం నిర్దేశించిన పార్లమెంటు సమావేశాలు జూలై 22 నుంచి ప్రారంభమై ఆగస్టు 22 వరకూ కొనసాగుతాయి. ఈ సమాచారాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి కిరణ్ రిజ్జు శనివారం సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్ పోస్టు చేస్తూ 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను 2024 జూలై 23న లోక్‌సభలో సమర్పిస్తారని తెలిపారు. బడ్జెట్ ముందురోజున వెలువడే ఆర్థిక సర్వే జూలై 22న వ స్తుంది.
లోక్‌సభ ఎన్నికలకు ముందు ఫిబ్రవరి నెలలో ఆర్థిక మంత్రి మధ్యంతర బడ్జె ట్‌ను సమర్పించారు. ప్రధాన నరేంద్ర మో ది నేతృత్వంలో మూడవదఫా అధికారంలోకి వచ్చిన సంకీర్ణ ప్రభుత్వం తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌పై పలు అంచనాలు నెలకొన్నాయి. గత రెండు దఫాల్లో అనుసరించిన విధానాలనే మోదీ 3.0 అనుసరిస్తుందా లేక విధాన మార్పులు ఉంటాయా అనే ఆసక్తి ఆర్థికవేత్తల్లో వ్యక్తమవుతున్నది. స్థూల ఆర్థిక స్థిరత్వంపై దృష్టి పెడుతూనే ఉపాధి కల్పనకు తోడ్పడే ప్రతిపాదనలు ఉంటాయని మెజారిటీ విశ్లేషకులు భావిస్తున్నారు.