01-02-2025 02:37:38 PM
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) శనివారం రికార్డు స్థాయిలో 8వ కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు. భారత్ లో బడ్జెట్ ను ప్రవేశ పెట్టే సంప్రదాయం బ్రిటిష్ పాలన నుంచి నిరంతరాయంగా కొనసాగుతోంది. దీని సమయం, తేదీ వంటి అంశాల్లో మార్పులు చేశారు. దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ సూక్తిని నిర్మల ప్రస్తావించారు. పేదలు, యువత, రైతులు, మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ నిర్మలా సీతారామన్ బడ్జెట్ రూపొందించారు.
2024-25 ఆర్థిక సంవత్సరానికి సవరించిన వ్యయం రూ. 47.16 లక్షల కోట్లు.
మూలధన వ్యయం రూ. 10.1 లక్షల కోట్లు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సవరించిన ఆదాయ అంచనా రూ. 31.47 లక్షల కోట్లు(అప్పుల మినహా).
నికర పన్నుల ద్వారా సమకూరిన ఆదాయం రూ. 25.57 లక్షల కోట్లు
ద్రవ్యలోటు జీడీపీలో 4.8 శాతంగా ఉంటుందని అంచనా
వచ్చే ఆర్థిక సంవత్సరానికి నికర అప్పులు రూ. 11.54 లక్షల కోట్లు ఉంటుదని అంచనా
2025-26 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యటోలు అంచనా 4.4 శాతం
కేంద్ర బడ్జెట్.. రంగాల వారీగా కేటాయింపులు ఇలా ఉన్నాయి.
రక్షణ శాఖ రూ. 4,91,732 కోట్లు
గ్రామీణాభివృద్ధి రూ. 2,66,817 కోట్లు
హోం శాఖ రూ.2,33,211 కోట్లు
వ్యవసాయం, అనుబంధ రంగాలు రూ. 1,71,437 కోట్లు
విద్య రూ. 1,28,650 కోట్లు
ఆరోగ్యం రూ. 98,311 కోట్లు
పట్టణాభివృద్ధి రూ. 96,777 కోట్లు
ఐటీ, టెలికాం రూ. 95,298 కోట్లు
విద్యుత్ రూ. 81,174 కోట్లు
వాణిజ్యం, పరిశ్రమలు రూ. 65,553 కోట్లు
సామాజిక సంక్షేమం రూ. 60,052 కోట్లు