సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య
ఎల్బీనగర్, ఫిబ్రవరి 1: కేంద్ర బడ్జెట్ పేదల వ్యతిరేక బడ్జెట్ అని, బడ్జెట్ కేటాయింపులను నిరసిస్తూ శనివారం ఎల్బీనగర్ రింగ్ రోడ్డులో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నిరసన ప్రదర్శనలో సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య మాట్లాడుతూ. . కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదలు, మధ్యతరగతి వర్గాలకు వ్యతిరేకంగా ఉన్నదని, కార్పొరేట్ శక్తులకు లాభాలు చేకూర్చే విధంగా ఉన్నదన్నారు.
దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచుకునే విధంగా లాభాలు చేకూర్చే విధంగా ఉందని, ఓట్లు వేసినా కోట్లాదిమంది భారతీయులకు ఉపయోగపడే విధంగా బడ్జెట్ లేదన్నారు. దళితులు, గిరిజనులు, ఆదివాసులకు రక్షణ లేదన్నారు. బడ్జెట్లో రూ. 15 లక్షల 68 వేల 936 కోట్ల లోటుతో ఉన్నదని ఈ లోటు పూడ్చడానికి ప్రజల పైన భారాలు మోపి పెద్దలకు దోచిపెట్టడానికి సిద్ధమయిందని విమర్శిం చారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చంద్రమోహన్, జగదీష్, జగన్, నర్సింహ, జిల్లా కమిటీ సభ్యుడు కేసరి నర్సిరెడ్డి, సర్కిల్ కార్యదర్శి ఆలేటి ఎల్లయ్య, ఐద్వా నాయకురాలు సంధ్య, కమ్మర్, రవీందర్, మంతెన యాదయ్య, దుర్గారావు, వీరయ్య, శ్రీనివాస్, చైతన్య, రాధ, కాశయ్య, మూర్తి నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.