calender_icon.png 6 February, 2025 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదరిక నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్

06-02-2025 12:19:24 AM

చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం

చేవెళ్ల, ఫిబ్రవరి 5: కేంద్రం పేదరిక నిర్ములనే  లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశ పెట్టిందని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కెఎస్.రత్నం కొనియాడారు. బుధవారం శంకర్పల్లి మండల కేంద్రంలో స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

అనంత రం ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులకు రూ.12లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు ఇవ్వడం గొప్ప విషయమన్నారు. వచ్చే ఐదేళ్లలో ప్రపంచ ఆర్థికరంగంలో మనదేశం మూడో స్థానంలో నిలు స్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం పట్టణానికి చెందిన శ్రీకాంత్ చారి ఆయన అనుచరులతో కలిసి పార్టీలో  చేరగా ..

కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, ప్రతాపరెడ్డి, రాములు గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు లీలావతి బయానంద్, మున్సిపల్ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు వాసుదేవ్ కన్నా, శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ నరసింహ, కృష్ణారెడ్డి, బీర్ల సురేష్, నరసింహారెడ్డి, పండిత్ రావు గౌడ్, వీరేందర్, ప్రవీణ్ కుమార్, మధుమోహన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.