calender_icon.png 2 April, 2025 | 7:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టరేట్‌లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ప్రారంభం

29-03-2025 12:23:43 AM

వనపర్తి టౌన్ మార్చి 28:  సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడిఓసీ)లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.కలెక్టరేట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను శుక్రవారం కలెక్టర్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ మేనేజర్ సత్యనారాయణతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ బ్యాంక్ ద్వారా ప్రతి రోజు నగదు,డిజిటల్ లావాదేవీలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.ఈ అవకాశాన్ని ఉద్యోగులు వినియోగించుకోవాలని తెలిపారు.బ్యాంక్ సిబ్బంది సమయ పాలన పాటిస్తూ మెరుగైన సేవలు అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏవో భాను ప్రకాష్, డిపిఆర్‌ఓ సీతారాం, ఎల్ డి ఎం కౌశల్ కిషోర్ పాండే, ఏ ఎల్ డి ఎం సాయి, బ్రాంచ్ మేనేజర్ సతీష్, ఇతర బ్యాంక్ అధికారులు, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.