06-03-2025 12:00:00 AM
ఎంపీ ఈటెల రాజేందర్
ఉప్పల్, మార్చి 5: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ) స్థాపనకు ప్రోత్సహిస్తున్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబద్ధత ప్రశంసనీయం అని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఉప్పల్ నియోజక వర్గ పరిధిలోని నాచారంలోని ఔట్ రిచ్ క్యాంపెయిన్ లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ఎంఎస్‌ఎంఈలను బలోపేతం చేయడంలో ఔట్రీచ్ కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని స్పష్టం చేశారు. ఉన్నత విద్య అభ్యసించాలనుకునే ప్రతిభావంతులైన విద్యార్థులకు బ్యాంకులు ఆర్థిక సాయం చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కోరారు.
అనంతరం లబ్ధిదారులకు రూ. 50 కోట్ల చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్య్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రఘునాథ్, బ్యాంక్ సీజీఎం కారే భాస్కర్ రావు, జీఎంలు సుధాకర్ రావు, రాజీవ్ పట్నాయక్, రీజినల్ హెడ్ భాస్కర్, 300 మందికి పైగా పారిశ్రామిక వేత్తలు, ఎస్హెచ్జి కష్టమర్లు పాల్గొన్నారు.