వికారాబాద్ ఫిబ్రవరి ౧ : రానున్న వేసవిలో జిల్లాలో నిరంతర విద్యుత్ సరపరాకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణా రాష్ట్ర శాసన సభా పతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శనివారo రానున్న వేసవి లో విద్యుత్ అంతరాయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అయన తెలిపారు.
జిల్లా లో 3.5 కోట్లతో నిర్మించిన నూతన సుప రింటెండెంట్ ఇంజనీర్ విద్యుత్ కార్యాల యాన్ని ప్రారంభించారు. వికారాబాద్ జిల్లా నారాయణ పూర్ గ్రామము లో 2.43 కోట్ల తో 33/11 కే వి ఉపకేంద్రము, మరియు జిల్లా సమీకృత కార్యాలయ సముదాయ ములో 3.13 కోట్ల తో 33/11 కే.వి. ఉపకేంద్రాలకు సంబంధించి శిలా పలా కాలను ప్రారంభించారు.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ నారాయణ పూర్ గ్రామము లో ఈ ఉప కేంద్రము ప్రారంభం అయితే త్రీ పేస్ విద్యుత్ తో పాటు గ్రామ రైతులకు ఎలాంటి అంతరాయం కలుగ కుండ ఇరవై నాలుగు గంటలు విద్యుత్ సరపరా అవుతుందని అయన అన్నారు.
జిల్లా కల్లెక్ట్రేట్ కార్యాలయ ఆవరణలో ప్రారంభం అవుతున్న విద్యుత్ ఉప కేంద్రము ద్వార కార్యాలయాలకు మరియు చుట్టు ప్రక్కల ఉన్న గ్రామాలకు విద్యుత్ అంతరాయము కలుగ కుండ విద్యుత్ సరపరా ఉంటుందని అయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ (రెవెన్యు) లింగ్యా నాయక్ పాల్గొన్నారు.