calender_icon.png 11 January, 2025 | 1:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా

02-01-2025 02:28:58 AM

వచ్చే వేసవి డిమాండ్‌కు అనుగుణంగా చర్యలు: ఎస్ ఈ రమేష్ బాబు

కరీంనగర్ సిటీ, జనవరి1: వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన విద్యుత్ ను అంతరాయం లేకుండా సరఫరా చేయడానికి ముందస్తు నిర్ధిష్టమైన కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, డిమాండ్ కు అనుగుణంగా సరఫరా చేయడానికి ఎన్ పి డి వి ఎల్ పరిధిలోని ప్రతి ఉద్యోగి కంకణ బద్ధులై పని చేస్తున్నారని కరీంనగర్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ మేక రమేష్ బాబు చెప్పారు. బుధవారం నగరంలోని సర్కిల్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గత సంవత్సర వార్షిక నివేదికను విడుదల చేసి మాట్లాడారు రాబోవు రోజుల్లో విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా అంచనాలు సిద్ధం చేశామన్నారు. కొత్తగా 8 పవర్ ట్రాన్స్ పార్మర్ల ఏర్పాటుకు 33/11 సబ్ స్టేషన్ లలో వాటి సామర్థ్యాన్ని పెంచడానికి చర్యలు చేపట్టామన్నారు. అలాగే టాంగ్ టెస్టర్ రిడింగ్ తీసుకొని దానికనుగుణంగా కొత్తగా 126 పిటిఅర్ల సామర్థ్యం పెంచామన్నారు.