calender_icon.png 8 January, 2025 | 8:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రబీలో ఆటంకాలు లేకుండా కరెంట్‌

12-12-2024 01:52:14 AM

* ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా

హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): రాబోయే రబీ సీజన్‌లో ఆటంకాలు లే కుండా విద్యుత్ సరఫరా చేయాలని జెన్‌కో ఎండీ సందీప్‌కుమార్ సుల్తానియా అధికారులను ఆదేశించారు. బుధవారం విద్యుత్ సౌధలో ప్రస్తుత విద్యుత్ సరఫరా పరిస్థితిపై సమీక్షించారు. రబీ సీజన్, వేసవిలో ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలన్నారు. టీజీట్రాన్స్‌కో, టీజీడిస్కంల పరిధిలో విద్యుత్ సరఫరా తీరును సమీక్షించారు. విద్యుత్ సంస్థలు నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకునాలని సూచించారు. సమావేశంలో టీజీట్రాన్స్‌కో సీఎండీడీ కృష్ణ భాస్కర్, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫరూకి, టీజీఎన్పీడిసీఎల్  సీఎండీ, కే వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.