నెలాఖరులోగా అందించేందుకు సన్నద్ధం
వికారాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి): అంగన్‌వాడీ చిన్నారులకు డ్రెస్‌కోడ్ ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారికి యూనిఫాం అందిచడంపై జూన్‌లోనే దృష్టి సారించింది. ప్రస్తుతం యూనిఫాంలను కుట్టించి పంపిణీకి సిద్ధం చేస్తోంది. తొలి విడతగా ప్రి మార్చిన సెంటర్లలోని చిన్నారులకు అందజేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాలో 23,735 మందికి
వికారాబాద్ జిల్లాలోని ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,107 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. 3 ఏళ్లలోపు చిన్నారులు 23,735 మంది ఆయా కేంద్రాలకు వస్తున్నారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలల్లో 366 అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తుండగా.. వీటిని ఈ ఏడాది నుంచి ప్రీ మార్చారు. ఈ కేంద్రాల్లో 16,500 వేల మంది చిన్నారులు ఉన్నారు. వీరందరికీ యూనిఫాం అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మహిళా సంఘాలకు అప్పగింత
యూనిఫాం కుట్టే బాధ్యతను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా మహిళా సంఘాలకు అప్పగించారు. ఇప్పటికే దాదాపు సగం వరకు కుట్టడం పూర్తయింది. వాటిని జిల్లా సంక్షేమ కార్యాలయానికి అప్పగించారు. యూనిఫాంకు అవసరమైన వస్త్రం ఆప్కో నుంచి ఐసీడీఎస్‌కు అందించారు. అలాగే ప్రాక్ కుట్టేందుకు రూ.60, షర్టు, నిక్కర్ కుట్టేందుకు రూ.80గా నిర్ణయించి ఇస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాకు సంబంధించి 6 వేల యూనిఫాంలను కుట్టించగా వాటిని ఈ నెలాఖరు వరకు చిన్నారులకు అందించనున్నారు. ఈ ఏడాది పూర్తయ్యేలోగా ప్రీ చిన్నారులందరికీ యూనిఫాం పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.