టీజేఏసీ తీర్మానం రాజ్యాంగ వ్యతిరేకం
లోకల్ క్యాడర్ జీటీఏ అధ్యక్షుడు వీరాచారి
హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): ఉపాధ్యాయులందరికీ ఏకీకృత సర్వీస్ నిబంధనలు అమలు చేయడం సాధ్యం కాదని లోకల్ క్యాడర్ గవర్నమెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధానకార్యదర్శి ఎం వీరాచారి, లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. ఉద్యోగ, ఉపా ధ్యాయ పెన్షనర్లు జేఏసీలో టీచర్లకు ఏకీకృత సర్వీస్ నిబంధనలు అమలు చేయాలని తీర్మానం చేయడాన్ని సోమవారం ఒక ప్రకటనలో వారు వ్యతిరేకిం చారు. ఈ ఒక్క తీర్మానం మినహా మిగతా నిర్ణయాలను తాము స్వాగతిస్తున్నట్టు పేర్కొన్నారు.
అయితే 1992 నుంచి 2018 వరకు అన్ని ప్రభుత్వాలు ఉమ్మడి సర్వీస్ నిబంధనలకు అనుకూలంగా జీవోలను తీసుకొస్తే వాటన్నిం టినీ సుప్రీం కోర్టు తిరస్కరించిందని తెలిపారు. ఉమ్మడి సర్వీస్ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని న్యాయ స్థానా లు స్పష్టమైన తీర్పునిచ్చాయని, అయినప్పటికీ టీజేఏసీ సోమవారం దీనిపై తీర్మానం చేయడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పంచాయతీరాజ్ ఉపాధ్యాయులంతా జిల్లా పరిషత్ పరిధిలోనే పనిచేయాలని వారు డిమాండ్ చేశారు.