మహబూబాబాద్,(విజయక్రాంతి): హన్మకొండ జిల్లా(Hanamkonda District) కమలాపూర్‌లో ఓ గుర్తు తెలియని మహిళా డెడ్ బాడీ అవశేషాలు(Unidentified Woman Dead Body Found) బయటపడ్డాయి. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే... హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపల్లి గూడెం గ్రామ శివారులోని ఓ రైతు పొలం వద్ద సుమారు 40 సంవత్సరాలు వయసు కలిగిన మహిళా డెడ్ బాడీకి సంబందించిన అవశేషాలు చూసిన గ్రామస్తులు సమాచారాన్ని పోలీసులకు తెలియజేశారు. దీంతో కాజీపేట ఏసీపీ తిరుమల్‌తో పాటు ఇన్ప్సెక్టర్ హరిక్రిష్ణ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. బయటపడ్డ డెడ్‌బాడీ అవశేషాలు ముదురు రంగు పసుపు చీర, ముదురు రంగు ఆకుపచ్చ జాకిటు, నీలిరంగు లంగా లభ్యమైనట్టు తెలిపారు. పుచ్చిపోయిన తలకు నలుపురంగు వెంట్రుకలు ఉన్నట్లు గమనించిన పోలీసులు ఆమె వయస్సు 35 నుండి 40 సంవత్సరాల మధ్యలో ఉంటుందని తెలిపారు.
హత్యనా.. ఆత్మహత్యనా
కాగా పంట పొలాల మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేసి డెడ్‌బాడీ పడేశారా లేక ఆమె హత్య చేసుకుందా అనే అనుమానాలు గ్రామంలో వినిపిస్తున్నాయి. సుమారు రెండు, మూడు నెలల క్రితం హత్య చేసి మూటగట్టి పొలంలో పాతిపెట్టగా ప్రస్తుతం పొలం దున్నుతున్న సమయంలో ఆ డెడ్‌బాడీ కి సంబందించిన అవశేషాలు బయటపడ్డాయని గ్రామానికి చెందిన మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.