calender_icon.png 20 April, 2025 | 1:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీ కెమెరాలు దొంగిలించిన గుర్తు తెలియని వ్యక్తులు

12-04-2025 12:01:38 AM

చిలుకూరు,  ఏప్రిల్ 11 : చిలుకూరు మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన రెండు సీసీ కెమెరాలను గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగి లించినారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు కర్ణాకర్ రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం, స్కూల్లో మొత్తం ఏడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, స్కూలు ముందర రెండు కెమెరాలు, స్కూలు లోపల మూడు కెమెరాలు, స్కూలు వెనక సైడు రెండు కెమెరాలు ఏర్పాటు చేయడం.

జరిగిందని, స్కూలుకి వెనకాల భాగాన ఏర్పాటుచేసిన రెండు కెమెరాలు దొంగలించినారని ఇట్టి విషయాన్ని స్కూల్ చైర్మన్ ఎస్.కె రంజాన్ బి తో కలిసి స్థానిక చిలుకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది వెంటనే  స్పందించిన పోలీసులు ఏఎస్‌ఐ వెంకటేశ్వరరావు,కానిస్టేబుల్ వెంకటేశ్వర్లతో కలిసి పాఠశాలకు వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్త్స్ర సురవి రాంబాబు అన్నారు.