calender_icon.png 28 February, 2025 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెక్ డ్యామ్‌కు గండి కొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

28-02-2025 01:15:41 AM

చిట్యాల, ఫిబ్రవరి 27: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నవాబుపేట గ్రామ శివారులోని చలివాగుపై నిర్మించిన చెక్ డ్యాంకు గుర్తు తెలియని వ్యక్తులు గండి కొట్టారు. టేకుమట్ల మండలంలోని పలు గ్రామాల శివారులోని పంట పొలాలకు చలి వాగు ద్వారా సాగు నీరు అందుతుంది. చలివాగులో నీరు నిల్వ ఉంటే చిట్యాల మండలం నవాబుపేట పరిసర ప్రాంతాల రైతులు ఈ నీటిని సద్వినియోగం చేసుకుంటారు.

సాగునీరు అందక పంటలు ఎండిపోతున్న దృష్ట్యా టేకుమట్ల శివారు రైతులు చలివాగుకు గండి కొట్టినట్లు ప్రచారం జరుగుతున్నది. పలుమార్లు సాగు నీటి సమస్యపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ దృష్టికి టేకుమట్ల రైతులు తీసుకెళ్లినా దాటవేసినట్లు రైతులు చెపుతున్నారు. ఈ క్రమంలోనే రైతులు ఆగ్రహంతో చలివాగు కు గండి కొట్టినట్లు తెలుస్తోంది.