05-03-2025 08:36:35 PM
చేగుంట (విజయక్రాంతి): నడుస్తున్న రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మాసాయిపేట మండలంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం... మాసాయిపేట్ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి నడుస్తున్న రైలు నుంచి జారీ పడి మృతి చెందాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు కామారెడ్డి రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అనంతరం శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.