11-04-2025 02:58:21 PM
రామకృష్ణాపూర్,(విజయక్రాంతి): రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన రామకృష్ణాపూర్ రవీంద్రఖని రైల్వేస్టేషన్(Ramakrishnapur Ravindrakhani Railway Station) సమీపంలో చోటు చేసుకుంది. మంచిర్యాల రైల్వే ఇన్వెస్టిగేషన్ అధికారి సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి సుమారు పది యాభై నిమిషాలకు సంఘమిత్ర రైలు క్రింద పడి సుమారు వయస్సు 35 సంవత్సరాల పైబడిన గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటం వల్ల శరీరం మొత్తం చిద్రమై గుర్తుపట్టుటకు వీలు లేనివిధంగా ఉందని తెలిపారు.
మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డుల ఆధారాలు లభించలేదని, మృతుడు తెలుపు నిలువు గీతలు గల నలుపు రంగు పాయింట్, ఎరుపు రంగు డ్రాయర్ ధరించి ఉన్నాడని అన్నారు. మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారని, మృతుడి సంబంధీకులు ఎవరైనా ఉంటే 87126 58589, 87126 58607 కు లేదా మంచిర్యాల రైల్వే పోలీసు స్టేషన్‌లో సంప్రదించాలని అన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మంచిర్యాల రైల్వే ఇన్వెస్టిగేషన్ అధికారి సత్యనారాయణ తెలిపారు.