07-04-2025 04:44:54 PM
చేగుంట (విజయక్రాంతి): చిన్నశంకరంపెట్ మండల పరిధిలోని కామారం రైల్వే గేట్ వద్ద రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడని, రైల్వే పట్టాలపై వ్యక్తి శవం పడి ఉందని కామారెడ్డి రైల్వే పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ హనుమన్లు గౌడ్ తెలిపారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, మృతుడి వద్ద ఎలాంటి వివరాలు లభించలేదని, ఎవరైనా శవాన్ని గుర్తుపట్టినట్లయితే కామారెడ్డి రైల్వే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని అన్నారు.