calender_icon.png 23 February, 2025 | 5:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

22-02-2025 12:00:00 AM

కాగజ్ నగర్, ఫిబ్రవరి 21 ( విజయ క్రాంతి): కాగజ్ నగర్ మండలం వెంపల్లి సిర్పూర్ టి రైల్వే స్టేషన్ మార్గ మద్యంలో రైలు కింద పడి వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ సురేష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..

సుమారు 35 సంవత్సరాలు వయసు గల వ్యక్తి  ఆరేగుడా సమీపంలో గుర్తు తెలియని రైలు కిందపడి మృతి చెందాడని తెలిపారు. మృతదేహాన్ని కాగజ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే ఈ నంబర్లకు 99484 81902, 87126 58605 సమాచారం అందించాలని కోరారు.