25 May, 2026 | 2:39 AM

పంట పొలాల్లో వరి కొయ్యలు కాల్చిన గుర్తుతెలియని రైతులు

25-05-2026 12:00 AM

ఎల్లారెడ్డి పేట మే 24(విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండ లం బొప్పాపూర్ గ్రామ శివారు భారత్ పెట్రోల్ పంపు వద్ద గుర్తుతెలియని రైతులు వరి కోయలు కాల్చడంతో, అధిక ఉష్ణోగ్రత, ఈదురు గాలులతో మంటలు ఇండ్ల వద్దకు, షాపుల వద్దకు చేరుకున్నాయి. కొయ్యలు అంటించిన రైతులు గుట్టు చప్పుడు కాకుం డా పరారయ్యారు. అధికారులు వెంటనే స్పందించి వీరి పైన చట్టరీత్య చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. వ్యవసాయ అధికారులు పలుమార్లు వరి కొయ్యలు కాల్చడం వల్ల భూమిలో ఉండే సారం తగ్గిపోతుందని తెలిపిన, రైతులు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. ప్రస్తుతం మంటలు అదేవిధంగా వ్యాప్తి చెందడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు.