calender_icon.png 8 January, 2025 | 7:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుర్తు తెలియని శవం లభ్యం

06-01-2025 11:36:02 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఓ గుర్తు తెలియని వ్యక్తి శవాన్ని పోలీసులు సోమవారం గుర్తించారు. కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండలం సీతాయిపల్లి అటవీప్రాంతంలో అటవీశాఖ అధికారులకు కుల్లిపోయిన మగవ్యక్తి శవం కన్పించడంతో పోలీసులకు సమాచారం అందించారు. సదాశివనగర్ సీఐ సంతోష్‌కుమార్, గాంధారి ఎస్సై ఆంజనేయులు తమ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. 20 నుంచి25 రోజుల మధ్యలో చెట్టుకు మగ వ్యక్తి ఉరివేసుకుని మృతిచెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. 

సీతాయిపల్లి  గ్రామ శివారులోని భవానిపేట్ రొడ్డులో అరకిలోమీటర్ లోపల  అటవీప్రాంతంలో ఎత్తుగడ్డపై ఉన్న చెన్నంగి చెట్టుకు నైలాన్ తాడుతో ఉరివేసుకున్న మగవ్యక్తి శవాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పారెస్ట్ బీట్ అధికారి బీల్వార్వ్రి అటవీప్రాంతంలో తిరుగుతుండగా శవం చెట్టుకు వేలాడుతూ కన్పించడంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి వెళ్లి పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. సంబంధీకులు ఎవరైన ఉంటే వచ్చి పోలీసులను సంప్రదించాలని కొరారు. మృతుని వద్ద పచ్చ తెలుపు కలర్ టవల్,నీలిరంగు లేత పసుపురంగు, లైనింగ్ షర్ట్, బ్లాక్ కలర్ జీన్ పాయింట్ ధరించి ఉన్నట్లు తెలిపారు. సంబంధీకులు ఎవరైన ఉంటే గాంధారి ఎస్సై ఆంజనేయులను సంప్రదించాలని సీఐ సంతోష్‌కుమార్ తెలిపారు.