23-03-2025 12:17:36 PM
భద్రాచలం,(విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నదిలో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో స్పందించిన పోలీసులు, మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకువచ్చి పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. మరింత సమాచారం కోసం అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.