calender_icon.png 17 April, 2025 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

08-04-2025 12:00:00 AM

పటాన్ చెరు, ఏప్రిల్ 7 :అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్ పూర్ మెడికల్ డివైస్ క్వారీ గుంతలో గుర్తుతెలియని మగ వ్యక్తి శవం లభించినట్లు సీఐ నరేష్ సోమవారం తెలిపారు. వయసు సుమారు 22 నుంచి 27 సంవత్సరాల మ ధ్యలో ఉంటుందని, ఎడమ చాతిపై యాద మ్మ అనే పచ్చబొట్టు ఉందని తెలిపారు. శవాన్ని గుర్తించిన వాళ్ళు అమీన్ పూర్ సీఐ 8712656728, అమీన్ పూర్ ఎస్త్స్ర 8712581445 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు.