calender_icon.png 22 January, 2025 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రిని కలిసిన యునిసెఫ్ ప్రతినిధులు

05-07-2024 12:26:18 AM

హుస్నాబాద్, జూలై 4: హుస్నాబాద్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను యునిసెఫ్ ప్రతినిధులు గురువారం కలిశారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రత విషయంలో విద్యార్థులకు, పిల్లలకు కల్పించాల్సిన అవగాహన అంశాలపై మంత్రితో చర్చించారు. 

ఆలయంలో పూజలు..

హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలోని శ్రీస్వయంభు రాజరాజేశ్వర స్వామిని మంత్రి పొన్నం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన మంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.