calender_icon.png 28 December, 2024 | 7:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్ కలెక్టర్‌కు యూనిసెఫ్ ప్రశంస

28-12-2024 03:44:12 AM

కరీంనగర్, డిసెంబర్ 27 (విజయ క్రాంతి) : కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని యూనిసెఫ్ ప్రశుసిస్తూ లేఖను రాసింది. శుక్రవారం యూనిసెఫ్ రాష్ర్ట వాష్ స్పెషలిస్టు వెంక టేశ్‌కు అందజేశారు.

జిల్లాలో ప్రత్యేక కార్య క్రమాలకు నాంది పలుకుతున్న కలెక్టర్, ప్రత్యేకంగా పారిశుధ్య కార్మికుల రక్షణ, భద్రత, గౌరవం పట్ల ప్రత్యేక శ్రద్ధ, వివిధ రకాల బీమా సౌకర్యం, ఎక్కడా లేని విధంగా ఆరోగ్య పరీక్ష కార్డుల పంపిణీ, నిరంతరం వైద్య పరీక్షలు జరిపించుట, రక్షణ కవచాలు అందజేసి పని సమయంలో తప్పక వాడుకునేలా చేయడంతోపాటు పారిశుధ్య కార్మికులను గౌరవిస్తూ, సన్మానిస్తూ ప్రోత్సహిస్తున్నారు.

ఇలాంటి అనేక కార్యక్రమాల పట్ల శ్రద్ధ కనబరుస్తున్న కలెక్టర్ పమేలా సత్పతికి యూనిసెఫ్ మూడు రాష్ట్రాల చీఫ్ జిలాలెమ్ బి తపస్సీ సంతకంతో కూడిన ప్రశంసా లేఖను అందజేశారు. ఇదే సహకారం తర్వాత కాలంలో తప్పక ఉండాలని కలెక్టర్ యూనిసెఫ్ను కోరారు. ఈ కార్యక్రమంలో యూనిసెఫ్ రాష్ర్ట కన్సల్టెంట్ ఫణీంద్ర కుమార్, జిల్లా సమన్వయకర్త కిషన్ స్వామి, స్వచ్ఛభారత్ సమన్వయకర్తలు రమేశ్, వేణు ప్రసాద్, క్లస్టర్ ఫెసిలిటేటర్లు కళ్యాణి, రవీందర్ పాల్గొన్నారు.