నందమూరి బాలకృష్ణ సినిమాలో హీరోయిన్ మారిపోయింది. బాలకృష్ణ, బోయపాటి శ్రీను ‘అఖండ 2: తాండవం’ కోసం నాలుగోసారి కొలాబరేట్ అయిన సంగతి తెలిసిందే. వారి మునుపటి కాంబో చిత్రం ‘అఖండ’కు సీక్వెల్‌గా ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సమర్పకురాలిగా ఉన్న ఈ చిత్రంలో కథనాయికగా మొదట ప్రగ్యా జైస్వాల్‌ను అనుకున్నారు.
కానీ అనూహ్యంగా ఇప్పుడు ఆమె స్థానంలో మరో స్టార్ హీరోయిన్ సంయుక్త మీనన్ చేరింది. ఈ విషయాన్ని చిత్రబృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శంషాబాద్ ప్రాంతంలో జరుగుతోంది. సంయుక్త శుక్రవారమే తాజా షెడ్యూల్లో పాల్గొంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, సినిమాటోగ్రాఫర్‌గా సీ రాంప్రసాద్ పనిచేస్తున్నారు. ఈ చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల కానుంది.