30-04-2025 01:08:32 AM
‘రామకృష్ణ’ వేడుకల్లో సీఐ సురేష్ బాబు
జగిత్యాల, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): మనం ఎంచుకున్న లక్ష్యాల సాధనకై నిరంతర సాధనతో కృషి చేస్తేనే అనూహ్య విజయాలు సాధించగలమని కోరుట్ల సీఐ బి.సురేష్ బాబు పేర్కొన్నారు. కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలోని రామక్రిష్ణ డిగ్రీ, పీజి కళాశాలలో మంగళవారం ‘విగమ 2025’ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ సురేష్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో ఉన్నత విద్యలు చదివి సమాజంలో మార్పు తీసుకు రావాలన్నారు.
ముఖ్యంగా యువత డ్రగ్స్, బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సిఐ హితవు పలికారు. కళాశాల కరస్పాండెంట్ యాద రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే విధంగా జీవితంలో ముందుకు సాగాలన్నారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థిని విద్యార్ధులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ గాడిపెల్లి హరిప్రియ అంజయ్యగౌడ్, ప్రిన్సిపాల్ బెజ్జారపు ప్రవీణ్ కుమార్, ఉపన్యాసకులు పాల్గొన్నారు.