09-03-2025 12:49:45 AM
ఒక్కరోజే రూ.911 కోట్ల పరిహార చెల్లింపు ఉత్తర్వులు
హైదరాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజోయ్‌పా ల్ ఆదేశాల మేరకు శనివారం తెలంగాణవ్యాప్తంగా జరిగిన జాతీయ లోక్‌అదాలత్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. న్యాయమూర్తులు ఒక్కరోజులోనే 14,18,637 కేసులకు పరిష్కారం చూపారు.
కక్షిదారులకు రూ.911 కోట్ల పరిహారానికి సంబంధించిన చెల్లింపు ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన లోక్‌అదాలత్‌లను జస్టిస్ అభినంద్ కుమార్ షావిలీ పర్యవేక్షించారు. వరంగల్, హనుమకొండలో లోక్ అదాలత్‌ను జస్టిస్ మౌషుమి భట్టాచార్య (వర్చువ ల్), జస్టిస్ కె.లక్ష్మణ్ (ఫిజికల్)గా ప్రారంభించారు. జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ కె.లక్ష్మణ్ కక్షిదారులకు పరిహారం చెక్కులు సైతం పంపిణీ చేశారు.
లోక్‌అదాలత్‌లో 165 కేసులకు పరిష్కారం
హైకోర్టులో లోక్‌అదాలత్ జరిగింది. న్యాయమూర్తులు జస్టిస్ అనిల్‌కుమార్, జస్టిస్ నర్సింగరావుతో కూడిన డివిజన్ బెంచ్ 165 కేసులకు పరిష్కారం చూపించింది. దీంతో మొత్తం 300 మందికి కేసుల నుంచి విముక్తి లభించిట్లయింది. కేసుల పరిష్కారంతో పిటిషనర్లకు రూ.15.93 కోట్ల పరిహారం అందింది.