calender_icon.png 28 December, 2024 | 7:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగుల జాబ్‌మేళాకు అనూహ్య స్పందన

28-12-2024 03:27:52 AM

348 మంది హాజరు.. 102 మంది ఎంపిక 

కరీంనగర్, డిసెంబర్ 27 (విజయక్రాంతి) : మహిళలు, పిల్లలు, వికలాంగులు వయో వృద్ధుల శాఖ, యూత్ ఫర్ జాబ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన దివ్యాంగుల జాబ్ మేళాకు అనూహ్య స్పందన లభించింది. 17 కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఈ మేళాలో పాల్గొనగా 348 మంది దివ్యాంగులు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు.

ఇందులో 165 మంది దివ్యాంగులు గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన 102 మందిని వివిధ కంపెనీల్లో పలు ఉద్యోగాలకు ఎంపిక చేశారు. కలెక్టర్ పమేలా సత్పతి జాబ్ మేళాను సందర్శించారు.  కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్,  జిల్లా సంక్షేమ అధికారి సబిత, యూత్ ఫర్ జాబ్స్ కోఆర్డినేటర్స్ మధుసూదన్ షాహిద్, జెడ్పీ సీఈవో శ్రీనివాస్, ఉపాధి కల్పన అధికారి తిరుపతిరావు, వారధి మెంబర్ సెక్రటరీ ఆంజనేయులు, సిడిపిఓలు కస్తూరి, సుగుణ, శ్రీమతి, ఎఫ్‌ఆర్వో రఫీ పాల్గొన్నారు.