calender_icon.png 3 April, 2025 | 12:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఐఎంసీ కాలేజీ టాలెంట్ టెస్ట్‌కు అనూహ్య స్పందన

25-03-2025 12:00:00 AM

పరీక్ష రాసిన 13 రాష్ట్రాలకు చెందిన 650 మంది

హైదారబాద్, మార్చి 24 (విజయక్రాంతి): ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనే  అండ్ కామర్స్ కాలేజీ, ట్వంటీఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ సంయుక్తంగా ఆన్‌లైన్ వేదికగా నిర్వహించిన టాలెంట్ టెస్ట్‌కు విశేష స్పందన లభించింది. డిగ్రీ, పీజీ విద్యార్థులకు కామర్స్ అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ టాలెంట్ నిర్వహి  కళాశాల ప్రిన్సిపల్ కూర రఘువీర్ పేర్కొన్నారు.

సోమవారం నిర్వహించిన టాలెంట్ టెస్ట్‌కు 13 రాష్ట్రాలకు చెందిన 650 మంది విద్యార్థులు పాల్గొన్నట్టు చెప్పారు. గంట వ్యవధితో 150 మల్టీపుల్ ప్రశ్నలకు నిర్వహించిన కామర్స్ టెస్ట్‌లో మొదటి స్థానంలో నిలిచిన ఎన్ రవీందర్ (ఐఐఎంసీ డిగ్రీ, పీజీ కాలేజీ) రూ.3 వేలు, యశస్వీ (కేఎల్ యూనివర్సిటీ) రెండో బహుమతి రూ.2 వేలు, షేక్ ఆయేషా (కేఎల్ యూనివర్సిటీ) రూ.వెయ్యి, సీహెచ్ జ్ఞాన సందీప్ (కేఎల్ యూనివర్సిటీ), అవని (సెయింట్ అలోయసియన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ), దీప (కస్తూర్బా డిగ్రీ, పిజీ కాలేజీ), మాన్సీ బరాడి (సెయింట్ జోసెఫ్ డిగ్రీ, పీజీ కాలేజీ), మహ్మద్ అవైసీయుద్దీన్ (ఐఐఎంసీ డిగ్రీ, పీజీ కాలేజీ), ప్రాంజల్ అగర్వాల (మహీంద్రా యూనివర్సిటీ) విద్యార్థులు రూ.500 చొప్పున ప్రోత్సాహక బహుమతులు గెలుచుకున్నారు. వైఎస్ ప్రిన్సిపళ్లు సంతోషి, తిరుమలరావు, కంప్యూటర్ సైన్స్ విభాగ అధిపతి ప్రశాంత్, కామర్స్ టెస్ట్ కోఆర్డినేటర్లు పరీక్ష నిర్వహణలో సహకరించారు.