calender_icon.png 8 April, 2025 | 1:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన

08-04-2025 12:23:18 AM

జగిత్యాల, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కోరుట్ల శాఖ, కోరుట్ల మెట్పల్లి ఆబ్స్టేట్రీషన్స్ అండ్ గైనకాలజిస్ట్ సొసైటీ (కేఎంఓజిఎస్) సంయుక్త నిర్వహణలో ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

కాగా ఈ వైద్య శిబిరంలో కోరుట్లకు చెందిన 20 మంది వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచిత మందులు పంపిణీ చేయగా, 12 వందల మంది రోగులు శిబిరానికి హాజరై వైద్య సేవలు పొందారు. కేఎంఓజిఎస్ అధ్యక్షురాలు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ వై.స్వీతీ అనూప్ మెగా హెల్త్ క్యాంప్ ప్రారంభించగా, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు శిబిరాన్ని సందర్శించి వైద్యులను అభినందించారు. కాగా ఈ  శిబిరంలో క్యాన్సర్ స్క్రీనింగ్ విభాగంలో బస్ట్ స్క్రీనింగ్ 200 మంది, గర్భాశయ స్క్రీనింగ్ 100 మంది, బోన్ డెన్సిటీ టెస్ట్ 200 మందికి నిర్వహించారు.

శిబిరంలో కంటి, దంత, జనరల్ ఫిజీషియన్, షుగర్, ఈసీజీ, హిమోగ్రామ్ వంటి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరంలో ఐఎంఏకు చెందిన ప్రముఖ వైద్యులు వై. అనూప్’రావు, రేగొండ రాజేష్, జ్యోత్స్న, శృతి, అనురాధ, జగదీష్, దీప్తి, వేణుగోపాల్, అనురాధ వేణుగోపాల్, మధుశ్రీ, నరేష్, ఇంద్రనీల్, గీతా ఇంద్రనీల్, అనురాగ్, మహదేవ్, రమేష్, అన్వేష్, మనోజ్, సోమేశ్ తదితరులు వైద్య సేవలందించారు. ఈ శిబిరాన్ని పలు పార్టీల నాయకులు, మునిసిపల్ మాజీ కౌన్సిలర్లు, ప్రముఖులు వచ్చి సందర్శించి వైద్యులను అభినందించారు.