calender_icon.png 23 October, 2024 | 5:09 AM

ఊహించని ప్రశ్నలు వచ్చాయ్!

23-10-2024 02:36:51 AM

  1. సమయం సరిపోక ఇబ్బంది పడ్డ అభ్యర్థులు
  2. రెండో రోజు గ్రూప్-1కు 21,817 మంది హాజరు

హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాం తి): రెండో రోజైన మంగళవారం గ్రూప్-1 మెయిన్స్ పేపర్-1 జనరల్ ఎస్సే పరీక్ష జరిగింది. ఈ పరీక్షలో అభ్యర్థులు ఊహించని ప్రశ్నలను అడిగారు. పుస్తకాల నుంచి రాలేదని, జనరల్‌గా ప్రశ్నలు అడిగినట్లు అభ్యర్థు లు తెలిపారు.

సిలబస్‌పై పూర్తిగా అవగాహ న ఉన్నవారే ఈ ప్రశ్నలకు జవాబులు రాస్తారని అభిప్రాయపడ్డారు. ఆర్థికపరమైన, ప్రపంచీకరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలతో కూడిన వినూత్న ప్రశ్నలు అడగడంతో అభ్యర్థులు కాస్త తడబడినట్లు తెలిసింది. సమయం సరిపోలేదని అభ్యర్థులు తెలిపా రు. ఒక్కో సెక్షన్‌లో మూడు ప్రశ్నలుంటా యి.

అందులో ఏదేని ఒకప్రశ్నకు వెయ్యి పదాల్లో సమాధానం రాయాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 50 మార్కులు. అయితే చాలా మంది అభ్యర్థులకు సమయం సరిపోకపోవడంతో 800 పదాల వరకే జవాబులు రాసి నట్లు తెలిసింది. ఒకటి, రెండు ప్రశ్నల్లో చిన్న అక్షర దోషాలున్నట్లు అభ్యర్థులు తెలిపారు.

69.4 శాతమే హాజరు..

మంగళవారం గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు. 46 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష జరిగినట్లు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షను నిర్వహించారు. మొత్తం 31,383 మంది అభ్యర్థు లకు గానూ 21,817 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కలిపి 69.4 శాతం మంది హాజరైనట్లు ఆయన తెలిపారు.