రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో సందీప్ వంగా తెరకెక్కించిన చిత్రం ‘యానిమల్’. 2023లో విడుదలైన ఈ చిత్రం మంచి సక్సెస్ సాధించింది. ప్రస్తుతం దీనికి సీక్వెల్‌ను ‘యానిమల్ పార్క్’ పేరిట రూపొందించనున్నారు. మొదటి భాగం క్లుమైక్స్లోనే సీక్వెల్ ఉందనే విషయాన్ని దర్శకుడు వెల్లడించారు. ఈ సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం గురించి నిర్మాత భూషణ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ప్రస్తుతం ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమా చేస్తున్న సందీప్.. ఈ చిత్రం పూర్తయిన తరువాత ‘యానిమల్ పార్క్’ ప్రారంభిస్తారట. “స్పిరిట్ ’ పూర్తున వెంటనే యానిమల్ పార్క్ మొదలు పెడతాం. 2027లో దీనిని విడుదల చేస్తాం. గతంలో వచ్చిన సినిమా కంటే ఎక్కువ థ్రిల్‌ను పంచుతాం. ఊహించనన్ని యాక్షన్ సన్నివేశాలుంటాయి. రణ్‌బీర్ కపూర్ పాత్ర మరింత క్రూరంగా ఉంటుంది” అని సందీప్ వంగా తెలిపారు. ప్రస్తుతం రణ్‌బీర్ కూడా ‘రామాయణ’ షూటింగ్లో బిజీగా ఉన్నారు.