calender_icon.png 5 February, 2025 | 11:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసమాన సమరయోధుడు

22-01-2025 12:00:00 AM

ఈనాడు మనం ఇంత నిశ్చింతగా స్వేఛ్ఛావాయువులు పీలుస్తున్నామంటే, దీని వెనుక అనేకమంది త్యాగధ నుల కృషి, అమరత్వం ఉన్నాయి. స్వాతం త్య్ర సముపార్జనకు ఎవరి పంథాలో వారు కృషి చేశారు. గాంధీజీ లాంటివారు అహింసతోనే స్వాతంత్య్రాన్ని సాధించాలని భావిస్తే, నేతాజీ వంటివారు అహింస అనే భాష ఆంగ్లేయులకు అర్థం కాదని, సాయుధ పో రాటమే శరణ్యమని నమ్మారు.

నమ్మిన సి ద్ధాంతానికి ఆచరణ రూపమిస్తూ, ఉన్నతోద్యోగాన్ని వదిలేసి ఆయన ఆంగ్లేయులపై పి డుగులా విరుచుకుపడ్డారు. లక్ష్యసాధన కోసం ‘ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ ’ పేరున రాజకీయ పార్టీని, ‘ఆజాద్ హింద్ ఫౌజ్ ’ పేరున ఒక విప్లవ సంస్థను స్థాపించడం ద్వా రా ఆంగ్లేయులపై ప్రత్యక్ష యుద్ధం ప్రకటించారు.

స్వాంతంత్య్ర సంగ్రామ చివరిఘట్టం లో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న స మయంలో నాటి ప్రపంచ పరిస్థితులకు అ నుగుణంగా అంతర్జాతీయ శక్తుల సహాయం తో పరాయి గడ్డపై నిలబడి స్వదేశ పోరాటం నెరపిన ఏకైక వీరుడు సుభాష్ చంద్రబోస్. 

“మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి. నేను మీకు స్వాతంత్య్రాన్నిస్తాను. మనం మన స్వాతంత్య్రం కోసం, ఏ విదేశీ శక్తి ముందూ యాచించనవసరం లేదు. మనం స్వాతంత్య్రానికి అవసరమైన మూల్యాన్ని చెల్లించి మరీ సాధించుకుంటాం. అది ఎంతైనా సరే” అంటూ దేశ ప్రజలలో ఉత్తేజాన్ని నింపారు. స్వాతంత్య్రం కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడిన ఈ అసాధారణ యోధుడు 1897 జనవరి 23న ఒడిషాలోని కటక్ పట్టణంలోని ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు.

తండ్రి జానకినాథ్ బోస్ లాయరు. తల్లి ప్రభావతీదేవి. బోస్ భార్య ఎమెలీ షెంకెల్. రెండవ ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు, దాన్నొక సువర్ణావకాశంగా తీసుకొని ఆంగ్లేయులను దెబ్బ కొట్టాలని భావించారు. యుద్ధం ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయులపై పోరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జపాన్, జర్మనీ దేశాలు పర్యటించారు. 

జపాన్ సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు, ఔత్సాహికులతో ‘ఆజాద్ హింద్ ఫౌజ్’- భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటుచేశారు. జపాన్  ప్రభు త్వం అందించిన సైనిక, ఆర్థిక, దౌత్య సహకారంతో సింగపూర్‌లో ‘ఆజాద్ హింద్’ ప్ర భుత్వాన్ని నెలకొల్పారు.

బోస్ రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా ఎన్నికైనారు. కానీ, గాంధీజీతో సిద్ధాంత పరమైన విభేదాల కారణంగా పదవికి రాజీనా మా చేశారు. బోసు రాజకీయ అభిప్రాయాలు, జర్మనీ, జపాన్లతో ఆయన నెరపిన మిత్రత్వంపై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 

1945 ఆగస్టు 18న తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో బోసు మరణించారని ప్రకటించారు. కానీ, ఆయన ప్రమాదం నుంచి బయటపడి అజ్ఞాతంలోకి వెళ్ళారని కూడా కొందరు నమ్ముతారు. ఏది ఏమైనా, జయంతే తప్ప వర్ధంతి లేని నాయకుడు కేవలం బోస్ మాత్రమే. భారతదేశ స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం, తాను కలలు గన్న సమసమాజ సాధనకు, నమ్మిన ఆశయాలకు అనుగుణంగా జాతిని జాగృతం చేయగలగడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి కాగలదు.

 యం డి. ఉస్మాన్‌ఖాన్