calender_icon.png 27 November, 2024 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

27-11-2024 01:16:04 AM

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, నవంబర్ 26 : బీఎడ్ నిరుద్యోగుల సమస్యలను రాష్ట్రప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీఎడ్ నిరుద్యోగ అభ్యర్థుల రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో  మంగళవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన దీక్షలో ఆయనమ మాట్లాడారు. రాష్ట్రంలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులన్నీ 100 శాతం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా మాత్రమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

ఎస్జీటీ టీచర్లకు ఇచ్చే 70 శాతం ప్రమోషన్‌న్లను పూర్తిగా తొలగించాలన్నారు. బీఎడ్ చేసిన వారికి వంద శాతం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఎస్‌జీటీ ఉద్యోగాలు ఏ విధంగా ఇస్తున్నారో, అదే విధంగా స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలనూ బీఎడ్ నిరుద్యోగులతో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రప్రభుత్వం ఏటా ఎడ్‌సెట్ నిర్వహించి 25 వేల మంది విద్యార్థులకు సీట్లు ఇస్తుందని, కానీ.. వారు కోర్సు పూర్తయ్యే లోపు ఎలాంటి ఉపాధి, ఉద్యోగం సాధించుకోలేకపోతున్నారన్నారు. రాష్ట్రంలో  ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. ధర్నాలో బీసీ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ ముదిరాజ్, ఓయూ జేఏసీ నాయకుడు కల్యాణ్, బీఎడ్ నిరుద్యోగ సంఘం అధ్యక్షుడు పాండు, సభ్యులు పాల్గొన్నారు.