calender_icon.png 23 April, 2025 | 12:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుద్యోగ యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

22-04-2025 08:22:41 PM

భూపాలపల్లి డీఎస్పీ ఏ. సంపత్ రావు..

కాటారం/భూపాలపల్లి (విజయక్రాంతి): నిరుద్యోగ యువత జాబ్ మేళాను సద్విని చేసుకోవాలని భూపాలపల్లి డీఎస్పీ ఏ. సంపత్ రావు(DSP Sampath Rao) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో టాస్క్ సంస్థ నిర్వహిస్తున్న జాబ్ మేళాలో పలు ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నట్లు తెలిపారు. విద్యార్హతల ప్రకారం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని తెలిపారు. క్యూ ఆర్ కోడ్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోని వారు 27వ తేదీన నిర్బహించే జాబ్ మేళా శిబిరంలో నమోదు చేసుకోవాలని తెలిపారు. భూపాలపల్లి సబ్ డివిజన్ పరిధిలోని నిరుద్యోగ యువతి, యువకులు చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఈ జాబ్ మేళాలో ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు.