20-03-2025 08:44:59 PM
రెడ్డి ఐక్యవేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి...
కామారెడ్డి అర్బన్ (విజయక్రాంతి): ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అర్హులైన అగ్రవర్ణ పేద నిరుద్యోగ యువతకు రాజీవ్ వికాస్ పథకంలో అవకాశం కల్పించాలని రెడ్డి ఐక్యవేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి అన్నారు. గురువారం కామారెడ్డిలో జాయింట్ కలెక్టర్కు శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాజీవ్ యువ వికాస్ పథకాన్ని కులాల ఆధారంగా కాకుండా ఆర్థిక పరిస్థితుల ఆధారంగా అగ్రవర్ణ కులాల్లోని పేదలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలన్నారు.
గత పది రోజుల క్రితం హైదరాబాదులో చంద్రశేఖర్ రెడ్డి అనే యువకుడు ఉద్యోగం కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో భార్యతో సహా ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఉద్యోగాలు లేక ఉన్న నిరుద్యోగ యువత నిరాశ నిస్సహాల్లోకి వెళ్లే అవకాశం ఉందన్నారు. అగ్రవర్ణకులాల్లో సైతం పేదలకు అవకాశం కల్పించే విధంగా రాజీవ్ యువ వికాస్ పథకంలో భాగంగా భాగస్వాములు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర కోర్ కమిటీ చైర్మన్ నాగర్తి చంద్రారెడ్డి, రెడ్డి సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.