calender_icon.png 14 March, 2025 | 1:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండుటెండలో ఉద్యోగం కోసం పాట్లు

13-03-2025 01:19:17 AM

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అమెజాన్ కంపెనీ వద్ద ఉద్యోగం కోసం నిరుద్యోగుల క్యూ

శేరిలింగంపల్లి, మార్చి 12 (విజయక్రాంతి): ఓ వైపు భానుడీ భగలు.నగరంలో బుధవారం ఉష్ణోగ్రతలు 40+ డిగ్రీల పైనే.ఆ మండుటెండలో ఎప్పుడు లోపలికి పిలుస్తారో తెలియని పరిస్థితి. ఓ  వైపు ఉద్యోగం సాధించాలనే గట్టి పట్టుదల. దీంతో గంటల తరబడి లైన్లో వేచి ఉన్న పరిస్థితి . ఈ దృశ్యం హైదరాబాద్ గచ్చిబౌలిలోని అమెజాన్ కంపెనీ వద్ద కనిపించింది.  ఇంటర్వ్యూ కోసం ఇంతమంది రావడంతో  దేశంలో నిరుద్యోగం ఎంతలా పెరిగిందో చూడాలంటూ నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీల వద్ద ఇలాంటి దృశ్యాలు కనిపిస్తూనే  ఉంటాయని  మరికొంతమంది ఐటీ నిపుణులు చెబుతున్నారు.